మళ్లీ ఆసుపత్రిలో చేరిన గోవా సీఎం.. ఆరోగ్యం నిలకడగా ఉందన్న రాష్ట్ర మంత్రి
- గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పారికర్
- ఇటీవలే తిరిగి విధుల్లోకి
- ఎండోస్కోపీ కోసమే ఆసుపత్రిలో చేరారన్న సీఎంవో
‘‘సీఎం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. భయపడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆయన అబ్జర్వేషన్లో ఉన్నారు. సీఎంను ఐసోలేటెడ్ రూములో పెట్టి చికిత్స అందిస్తున్నాం. ఓ రోజంతా ఆయన ఇక్కడే ఉంటారు. వైద్యులు కొన్ని పరీక్షలు చేయాలంటేనే ఆయన ఇక్కడికి వచ్చారు. పారికర్ ఓ ఫైటర్. ఒక్క రోజులోనే ఆయన తిరిగి ఇంటికి వెళ్తారు’’ అని గోవా ఆరోగ్యశాఖా మంత్రి విశ్వజీత్ రాణె పేర్కొన్నారు.