'మిఠాయి'తో మిగిలిన చేదు అనుభవం!
- నిన్ననే థియేటర్స్ కి వచ్చిన 'మిఠాయి'
- తొలి రోజునే నెగెటివ్ టాక్
- ట్విట్టర్ నుంచి వైదొలగిన రాహుల్ రామకృష్ణ
ఈ సినిమాకి నెగెటివ్ టాక్ రావడంతో, అభిమానులకు క్షమాపణలు చెబుతూ రాహుల్ రామకృష్ణ ట్వీట్ చేశాడు. చివరి నిమిషం వరకూ ఈ సినిమాను రిపేరు చేయడానికి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదని చెప్పాడు. మరో కథతో ప్రేక్షకుల ఆదరణ పొందడానికి ప్రయత్నిస్తామని అన్నాడు. ఆయన ఇంతగా వివరణ ఇచ్చినా, ట్విట్టర్లో భయంకరమైన కామెంట్స్ వస్తున్నాయి. ఆ కామెంట్స్ ను భరించలేక ఆయన ట్విట్టర్ నుంచి వైదొలిగాడు.