హీరోగా రకుల్ సోదరుడు 'అమన్' ఎంట్రీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హీరోగా రకుల్ సోదరుడు 'అమన్' ఎంట్రీ

  • తెలుగులో స్టార్ హీరోయిన్ గా రకుల్
  •  హీరోగా ఆమె సోదరుడు అమన్ ఎంట్రీ 
  • రేపు ఉదయం తొలి సినిమా లాంచ్    
తెలుగు తెరపై రకుల్ ప్రీత్ సింగ్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. చిన్న హీరోతో .. చిన్న సినిమాతో తన కెరియర్ ను ఆరంభించిన రకుల్, స్టార్ హీరోయిన్స్ జాబితాలోకి చేరిపోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. కొత్త హీరోయిన్స్ నుంచి పోటీని తట్టుకుంటూనే, తమిళంలోను ఆమె తన జోరు చూపించడానికి ప్రయత్నిస్తోంది.

ఈ నేపథ్యంలోనే ఆమె సోదరుడు 'అమన్' హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రంగాన్ని సిద్ధం చేసేసుకున్నాడు. కొంతకాలంగా ఈ వార్త వినిపిస్తున్నా, అన్ని పనులు ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చాయన్న మాట. 'అమన్' హీరోగా చేయనున్న ఈ సినిమాకి దర్శకుడు దాసరి లారెన్స్. రజినీ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రేపు ఉదయం 10 గంటలకు హైదరాబాద్ - అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు.
aman
rakul

More Telugu News