Tollywood: ప్రమోషన్ లో పదనిసలు: నట్టింట్లో అడుగుపెట్టిన పులిని చూసి కామెడీ చేసిన అనిరుధ్ రవిచందర్..!

  • తుంబా చిత్రం ప్రమోషన్ లో ఆసక్తికర సన్నివేశం
  • అనిరుధ్ తో ఆడుకున్న దర్శకుడు
  • ఇంటికొచ్చిన పులిని చూసి అనిరుధ్ తత్తరపాటు

ఇటీవల కాలంలో సినిమాకు ప్రమోషన్ తప్పనిసరి అయింది. సగటు బడ్జెట్ పెరిగిపోవడంతో నిర్మాత దగ్గర్నుంచి ఎగ్జిబిటర్ వరకు ప్రతి పైసా తిరిగి రావాల్సిందేనంటున్నారు. తమ సినిమాను ప్రజల్లోకి ఎంత బలంగా తీసుకెళితే అంత భారీగా ఓపెనింగ్స్ వస్తాయని ఫిలింమేకర్స్ భావిస్తున్నారు. అందుకే ప్రమోషనల్ ఈవెంట్లను వినూత్నంగా ప్లాన్ చేస్తూ ప్రేక్షకులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా, తమిళ సినిమా తుంబా కోసం చిత్రబృందం వెరైటీ ప్రమోషనల్ వీడియో రిలీజ్ చేసింది. ఓ ఫన్నీ స్కిట్ రూపంలో ఈ వీడియో డిజైన్ చేశారు. మ్యూజిక్ డైరక్టర్ అనిరుధ్ రవిచందర్ తన నివాసంలో వీడియో గేమ్ ఆడుకుంటూ ఉండగా ఫోన్ వస్తుంది. ఆ కాల్ చేసింది దర్శకుడు హరీష్ రామ్.

తన సినిమాకు బాణీలు అందించాలని, ఓ సీన్ కు శాంపిల్ ట్యూన్ ఇవ్వగలరా అంటూ హరీష్ రామ్ రిక్వెస్ట్ చేస్తాడు. ఎవరు హీరో అని అనిరుధ్ అడిగితే టైగర్ అని రిప్లయ్ ఇస్తాడు డైరక్టర్. రాజమౌళి ఈగను పెట్టి సినిమా తీస్తే మీరు టైగర్ ను పెట్టి సినిమా తీస్తున్నారా.. సరే సీన్ ఎక్స్ ప్లెయిన్ చేయండి అని అనిరుధ్ చెప్పగానే... పులి ఇంట్రడక్షన్ సీన్ అది, ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావాలి అని హరీష్ రామ్ చెబుతాడు. సరే పులి వచ్చే సీన్లు ఏమైనా ఉంటే పంపండి, బాగా ఫీలై చేస్తాను అంటూ బదులిస్తాడు అనిరుధ్. మళ్లీ తన వీడియో గేమ్ ఆడడంలో నిమగ్నమవుతాడు అనిరుధ్. ఇంతలో ఇంట్లోకి ఓ పెద్దపులి ఠీవీగా అడుగులేసుకుంటూ ప్రవేశిస్తుంది.

ఆ పులిని చూసి అనిరుధ్ బిక్కచచ్చిపోతాడు. వెంటనే ఫోన్ అందుకుని ఓరి దుర్మార్గులారా... సీన్ పంపండి అంటే నిజం పులినే పంపుతారా! అంటూ పులి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత పులి పక్కనే కూర్చుని తన ఇంట్రడక్షన్ సీన్ బీజీఎంను తానే చేయించుకుంటుంది. అదండీ.. ఈ క్రియేటివ్ ప్రమోషనల్ వీడియో కథా కమామీషు. ఈ సినిమా పేరు తుంబా. రీగల్ రీల్స్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ సినిమాకు హరీష్ రామ్ దర్శకుడు. 

  • Loading...

More Telugu News