‘ప్యారడైజ్ బిర్యానీ’కి దక్కిన గౌరవం.. ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు’లో స్థానం
- ఒక్క ఏడాదిలో దాదాపు 70 లక్షల మందికి పైగా విక్రయం
- ‘ప్యారడైజ్’ చైర్మన్ కి లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు
- ‘ప్యారడైజ్’ కు దక్కిన గౌరవంపై సిబ్బంది హర్షం
ఈ సందర్భంగా ‘ప్యారడైజ్’ చైర్మన్ అలీ హేమతి మాట్లాడుతూ, తమ సంస్థకు ఈ అవార్డు రావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ అవార్డుతో తమ బాధ్యత మరింత పెరిగిందని చెప్పారు. బిర్యానీలో నాణ్యత, వినియోగదారుల నమ్మకంతో పాటు తమ సిబ్బంది కృషి వల్లనే తమకు ఈ గౌరవం దక్కిందని అన్నారు.
‘ప్యారడైజ్’ సీఈఓ గౌతమ్ గుప్తా మాట్లాడుతూ, దేశ వ్యాప్తంగా తమ సంస్థ బ్రాంచ్ లు 37 ఉన్నాయని, త్వరలోనే ఇతర దేశాల్లోనూ తమ బ్రాంచ్ లు ప్రారంభిస్తున్నట్టు చెప్పారు.