'హుషారు' హీరోతో పాయల్ రాజ్ పుత్
- 'ఆర్ ఎక్స్ 100'తో గుర్తింపు
- గ్లామర్ కి ఎక్కువ మార్కులు
- అదే గ్లామర్ డోస్ తో మరో సినిమా
సి.కల్యాణ్ నిర్మించనున్న ఈ సినిమాకి దర్శకుడు ఎవరన్నది త్వరలోనే తెలియనుంది. కథానాయికగా మాత్రం పాయల్ రాజ్ పుత్ ను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. 'ఆర్ ఎక్స్ 100' సినిమాలో భారీగా అందాలు ఆరబోసిన ఈ అందాల భామ, ఇకపై గ్లామర్ తో పాటు నటనకి ప్రాధాన్యత కలిగిన పాత్రలను ఎంచుకుంటానని ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది. కానీ 'ఆర్ ఎక్స్ 100' తరహాలోనే తాజా చిత్రంలోనూ ఆమె అందాలను ఆరబోయనున్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ సినిమా కాకుండా ఆమె చేతిలో మరో నాలుగు ప్రాజెక్టుల వరకూ వున్నాయి. మొత్తానికి పాయల్ గట్టిగానే నిలదొక్కుకునేలా కనిపిస్తోంది.