ప్రియమణి ప్రధాన పాత్రలో .. థ్రిల్లర్ మూవీగా 'సిరివెన్నెల'
- కథానాయికగా మంచి పేరు
- థ్రిల్లర్ జోనర్లో సాగే మూవీ
- విలన్ గా 'కాలకేయ' ప్రభాకర్
రామసీత - బాషా సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఇటీవలే టాకీపార్టును పూర్తి చేసుకుంది .. రెండు పాటలు మాత్రమే చిత్రీకరించవలసి వుంది. పులిజాల ప్రకాశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, థ్రిల్లర్ జోనర్లో సాగేదే అయినప్పటికీ, కుటుంబ సమేతంగా చూడదగినదిగా ఉంటుందని అంటున్నారు. 'కాలకేయ' ప్రభాకర్ ప్రధానమైన విలన్ గా నటించిన ఈ సినిమాలో, రాజేంద్ర ప్రసాద్ మనవరాలు (మహానటి .. చైల్డ్ ఆర్టిస్ట్) కూడా ఒక ముఖ్యమైన పాత్రను పోషించింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.