చింతమనేని వీడియో ఎఫెక్ట్.. వైసీపీ నేత రవిని అరెస్ట్ చేసిన పెదపాడు పోలీసులు!
- దళితులపై చింతమనేని అనుచిత వ్యాఖ్యలు
- వీడియోను ఎడిట్ చేశారని టీడీపీ నేత ఫిర్యాదు
- వైసీపీ పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి రవి అరెస్ట్
కత్తుల రవి జైన్ చింతమనేనికి సంబంధించిన వీడియోను షేర్ చేసినందుకు గానూ పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. కాగా, రవిని వెంటనే విడుదల చేయకపోతే ఆందోళనకు దిగుతామని వైసీపీ శ్రేణులు, ఆయన మద్దతుదారులు హెచ్చరించారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన చింతమనేనిని అరెస్ట్ చేయకుండా తమ నేతను అదుపులోకి తీసుకోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.