చంద్రబాబుకు వీడియో టీజర్ తో వర్మ కౌంటర్!

  • 'లక్ష్మీస్ ఎన్టీఆర్' విడుదలకు సిద్ధం
  • ప్రమోషన్ కార్యక్రమాల్లో వర్మ బిజీ
  • చంద్రబాబు ఉదయం చేసిన వ్యాఖ్యలపై స్పందన
'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా విడుదలకు సిద్ధమవుతున్న వేళ, సినిమా ప్రమోషన్ లో ఫుల్ బిజీగా ఉన్న దర్శకుడు రాంగోపాల్ వర్మ, తనకు దొరికిన ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ఈ ఉదయం చంద్రబాబునాయుడు, తన టెలీ కాన్ఫరెన్స్ లో సినిమాను ప్రస్తావిస్తూ, ఎన్టీఆర్‌ చరిత్రను వక్రీకరించేలా కొందరు కుట్రలు పన్నుతున్నారని, కుట్రదారుల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించిన సంగతి తెలిసిందే.

ఆ వెంటనే స్పందించిన వర్మ, ఓ వీడియో టీజర్ తో కౌంటర్ ఇచ్చారు. 'మహానాయకుడు' చిత్రంలోని రానా (చంద్రబాబు పాత్రధారి) కనిపించే వీడియోను పోస్ట్ చేస్తూ, "లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ మీద వచ్చే రకరకాల రియాక్షన్స్‌కు మీ నుండి వచ్చే రియాక్షన్‌ ఏంటి సార్‌?" అని జర్నలిస్ట్ ప్రశ్నించినట్టుగా, "దానికి సమాధానంగా మీరేమన్నా సరే రియాక్ట్ కావొద్దు, ఏమన్నా సరే" అంటున్న రానాను చూపించారు. ఈ వీడియో బిట్ 'మహానాయకుడు' థియేటరికల్ ట్రయిలర్ లోనిదే కావడం గమనార్హం. ఇక దీనికి క్యాప్షన్ గా "లక్ష్మీస్ ఎన్టీఆర్ పై చంద్రబాబు భయం ఇలా ఉంది" అని రాశారు.



Go Back to Shorts
Lakshmi's NTR
Chandrababu
Ramgopal Varma
Scared

More Telugu News