నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ఎక్కడా చెప్పలేదు: టీడీపీ ఎంపీ కొనకళ్ల

  • మళ్లీ ఎంపీగానే పోటీ చేస్తాను
  • కొడాలి నానిని ఓడించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాం
  • లోకేశ్ మా జిల్లాలో ఎక్కడి నుంచి పోటీ చేసినా స్వాగతిస్తాం
ఏపీలో రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని తాను ఎక్కడా చెప్పలేదని కృష్ణా జిల్లా మచిలీపట్నం టీడీపీ ఎంపీ కొనకళ్ల నారాయణ స్పష్టం చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, మళ్లీ తాను ఎంపీగానే పోటీ చేస్తానని, అయితే, పార్టీ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని చెప్పారు. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభమైందని చెప్పిన ఆయన, లోకేశ్ తమ జిల్లాలో ఎక్కడి నుంచి పోటీ చేసినా స్వాగతిస్తామని అన్నారు. ఈ సందర్భంగా గుడివాడ వైసీపీ నేత కొడాలి నాని గురించి ఆయన ప్రస్తావించారు. రాబోయే ఎన్నికల్లో కొడాలి నానిని ఓడించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టామని వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
Krishna District
machilipatnam
gudivada
Telugudesam
mp
konkalla
YSRCP
mla
kodali nani

More Telugu News