నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలో నాని?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలో నాని?

  • 'జెర్సీ'తో పలకరించనున్న నాని 
  • విక్రమ్ కుమార్ తో సెట్స్ పైకి 
  • తదుపరి సినిమా ఇంద్రగంటితో
ప్రస్తుతం నాని .. 'జెర్సీ' సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే, తదుపరి సినిమా కోసం విక్రమ్ కుమార్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లాడు. ఈ సినిమాలోను నాని కొత్తగా కనిపిస్తాడని అంటున్నారు. నాని కెరియర్లో ఇదో విభిన్నమైన సినిమా అవుతుందనే టాక్ ఫిల్మ్ నగర్లో వుంది.

ఈ నేపథ్యంలోనే నాని .. ఇంద్రగంటి మోహనకృష్ణకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'అష్టా చమ్మా' ... 'జెంటిల్ మేన్' ప్రేక్షకులను మెప్పించాయి. అందువల్లనే ఇంద్రగంటి కథ చెప్పగానే నాని ఓకే అనేశాడట. ఈ సినిమాలో నాని నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర కోసం సుధీర్ బాబును తీసుకున్నట్టుగా సమాచారం. ఒక రకంగా మల్టీస్టారర్ అనే అనుకోవాలి. ఇది నానికి 25వ సినిమా కావడంతో సంఖ్యా పరంగా ప్రత్యేకతను సంతరించుకుంది.
nani
sudheer babu

More Telugu News