పదవులు అంటే అధికారం కాదు బాధ్యత: టీ-మంత్రి జగదీశ్ రెడ్డి
- రెండోసారి మంత్రిగా అవకాశం దక్కడం సంతోషకరం
- నాకు ఏ శాఖ కేటాయించినా బాధ్యతగా నిర్వహిస్తా
- మంత్రి వర్గంలో మహిళలు లేనంత మాత్రాన తప్పుబట్టాల్సిన పని లేదు
గతంలో విద్యుత్ శాఖా మంత్రిగా పనిచేసిన మీకు మళ్లీ అదే శాఖ ఇచ్చే అవకాశాలున్నాయా? అనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, తనకు ఏ శాఖ కేటాయించినా ఫర్వాలేదని చెప్పారు. ఏ శాఖ అయినా బాధ్యతగా నిర్వహిస్తానని అన్నారు. మంత్రి వర్గంలో మహిళలకు స్థానం లేనంత మాత్రాన తప్పుబట్టాల్సిన అవసరం లేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళల పక్షపాతి అని చెప్పుకొచ్చారు. తెలంగాణలో తమ ప్రభుత్వ హయాంలో మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని అన్నారు.