నేడు చెన్నై వెళ్లనున్న అమిత్ షా.. కీలక ప్రకటన వెలువడే అవకాశం

  • అమిత్ షా తో భేటీ కానున్న అన్నాడీఎంకే సీనియర్లు
  • పొత్తు, సీట్ల పంపకాలపై చర్చ
  • సమావేశానంతరం కీలక ప్రకటన చేయనున్న బీజేపీ అధినేత
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈరోజు చెన్నై వెళ్లనున్నారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తుపెట్టుకోబోతోంది. చెన్నై పర్యటన సందర్భంగా అన్నాడీఎంకే సీనియర్ నేతలు అమిత్ షాతో భేటీకానున్నారు. ఈ సమావేశంలో ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకాలు ఖరారుకానున్నాయి. భేటీ ముగిసిన తర్వాత పొత్తు, సీట్ల పంపకాలపై అమిత్ షా కీలక ప్రకటన చేయనున్నారు. ఈ మేరకు తమిళనాడు బీజేపీ నేతలు ప్రకటించారు. మరోవైపు, ఒకట్రెండు రోజుల్లో పొత్తులపై ప్రకటన చేస్తామని తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం నిన్న రాత్రి మీడియాకు తెలిపారు.
Go Back to Shorts
amit shah
Tamil Nadu
bjp
aiadmk
alliance

More Telugu News