'ఓటుకు నోటు' అప్ డేట్... నేడు రేవంత్ రెడ్డిని విచారించనున్న ఈడీ!
- సంచలనం సృష్టించిన 'ఓటుకు నోటు'
- విచారణను వేగవంతం చేసిన ఈడీ
- ఏసీబీ చార్జ్ షీట్ ఆధారంగా విచారణ
ఈ క్రమంలో ఇప్పటికే ఉదయసింహను విచారించి, స్టీఫెన్ సన్ వద్దకు తీసుకెళ్లిన రూ. 50 లక్షలు ఎక్కడివన్న కోణంలో విచారించింది. ఇక నేడు రేవంత్ రెడ్డిని ఈడీ మరోసారి ప్రశ్నించనుంది. ఆయన్ను కూడా డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చారన్న విషయంలోనే ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారని సమాచారం. ఈ కేసులో గతంలో తెలంగాణ ఏసీబీ వేసిన చార్జ్ షీట్ ఆధారంగా విచారణను ముందుకు తీసుకెళుతున్నట్టు ఈడీ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఈ ఉదయం 11 గంటలకు ఈడీ కార్యాలయానికి రావాలని రేవంత్ కు మూడు రోజుల క్రితమే నోటీసులు వెళ్లిన సంగతి తెలిసిందే.