టెక్సాస్ లో భార్య శాంతిని కాల్చి చంపి, తనను తాను కాల్చుకున్న శ్రీనివాస్!
- టెక్సాస్ లో తెలుగు యువకుడి దారుణం
- కుటుంబ కలహాలతో భార్య హత్య
- మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు
నిన్న ఆ ఇంటి నుంచి తుపాకీ శబ్దాలు వినిపించడంతో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వచ్చారు. అప్పటికే శాంతి, శ్రీనివాస్ లు విగత జీవులుగా కనిపించారు. ఆ సమయంలో వీరి కుమార్తె ఇంట్లోనే తన గదిలో ఉండగా, కుమారుడు చదువు నిమిత్తం కాలేజీకి వెళ్లాడని పోలీసులు తెలిపారు. శ్రీనివాస్, శాంతి మధ్య గొడవ ఎందుకు జరిగిందన్న విషయమై కుమార్తె వద్ద సమాచారం లేదని, కేసును విచారిస్తున్నామని తెలిపారు.