టాలీవుడ్ నిర్మాత కుమార్తెకు అదనపు కట్నం వేధింపులు
- కట్టా రాంబాబు కుమార్తెకు అదనపు కట్నం వేధింపులు
- భర్త, మామ వేధిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు
- కేసు నమోదు చేసి, విచారిస్తున్న పోలీసులు
పెళ్లైన తర్వాత భార్యాభర్తలిద్దరూ మూడేళ్లపాటు హోసూరులో ఉండి, ఆ తర్వాత బెంగళూరుకు మారారు. ఈ క్రమంలో గత కొన్ని నెలలుగా మరో రూ. 5కోట్లు కట్నంగా తీసుకురావాలని రమ్యకు వేధింపులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో హోసూరు మహిళా పోలీస్ స్టేషన్ లో ఆమె ఫిర్యాదు చేశారు. అదనపు కట్నం కోసం తన భర్త, ఆయన తండ్రి వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.