జవాన్లపై దాడి పిరికిపందల చర్యే.. ఉగ్రదాడిని ఖండించిన వైఎస్ జగన్!
- అమరులకు సంతాపం తెలిపిన జగన్
- జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి
- క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
జమ్మూకశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతిపొరలో నిన్న జరిగిన ఆత్మాహుతి దాడిలో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఓ కారులో 350 కేజీల శక్తిమంతమైన ఐఈడీ పేలుడు పదార్థాలను పేర్చుకున్న ఉగ్రవాది జవాన్ల బస్సును ఢీకొట్టి తనను తాను పేల్చుకున్నాడు. ఈ ఘటనపై జమ్మూకశ్మీర్ పోలీసులతో పాటు ఎన్ఐఏ, ఎన్ఎస్ జీ నిపుణులు సమగ్ర విచారణ జరపనున్నారు.