స్పా సెంటర్ లో క్రాస్ మసాజ్... రెండు రోజుల జైలుశిక్ష విధించిన నాంపల్లి కోర్టు!

  • అమీర్ పేటలో రితిక బ్యూటీ స్పా సెంటర్
  • క్రాస్ మసాజ్ జరుగుతోందని ఫిర్యాదు
  • అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు
హైదరాబాద్ లోని అమీర్ పేటలో అనుమతి లేకుండా మసాజ్ సెంటర్ ను నిర్వహించడంతో పాటు, పురుషులకు మహిళలతో, మహిళలకు పురుషులతో మసాజ్ చేయిస్తున్నారన్న ఆరోపణలపై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు, రెండు రోజుల జైలుశిక్షను విధించింది. కేసు పూర్వాపరాల్లోకి వెళితే, ఎల్లారెడ్డిగూడ ప్రాంతానికి చెందిన ఎస్‌ సతీశ్ కుమార్‌ అనే వ్యక్తి, అమీర్‌ పేట లాల్‌ బంగ్లా దగ్గర రితిక బ్యూటీ స్పా సెంటర్‌ ను అనుమతి లేకుండా పెట్టాడు.

ఇక్కడ క్రాస్ మసాజ్ జరుగుతోందని ఫిర్యాదు అందుకున్న ఎస్ఆర్ నగర్ పోలీసులు, దాడి చేసి సతీశ్ కుమార్‌ ను, నిర్వాహకురాలు స్వాతి అలియాస్‌ సుస్మితలను అరెస్ట్ చేశారు. ఆపై కేసును దర్యాప్తు చేసి నిందితులను కోర్టులో ప్రవేశపెట్టారు. స్పాలో సీసీ కెమెరాలు లేవని, అనుభవమున్న ఫిజీషియన్‌ ను నియమించలేదని, సందర్శకుల వివరాలు లేవని చార్జ్ షీట్ దాఖలు చేశారు. కేసును విచారించిన న్యాయమూర్తి సాంబశివరావు నిందితులకు రెండు రోజుల జైలు శిక్ష విధించారు.
Go Back to Shorts
Ameerpet
Police
Cross Massage
Jail Term
Nampalli Court

More Telugu News