ట్రిపుల్ తలాక్ చెప్పిన వాళ్లను జైలుకు పంపిస్తున్నారు.. అది చెప్పకుండా భార్యను వదిలిపెట్టిన మోదీనేం చేయాలి?: చంద్రబాబు

  • విజయనగరం జిల్లాలో పర్యటించిన చంద్రబాబు 
  • కుటుంబ వ్యవస్థపై నమ్మకముంది
  • భువనేశ్వరికి భర్తగా గర్వపడుతున్నా
ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ.. ముస్లింలను ఈ కేసులో జైలుకు పంపిస్తున్నారని.. తాను మాత్రం ట్రిపుల్ తలాక్ చెప్పకుండానే భార్యను వదిలిపెట్టారని.. అలాంటి వ్యక్తిని ఏం చేయాలని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. నేడు విజయనగరం జిల్లాలో పర్యటించిన చంద్రబాబు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. కుటుంబ వ్యవస్థపై తనకు నమ్మకముందన్నారు. భువనేశ్వరి భర్తగా, లోకేశ్ తండ్రిగా, దేవాన్ష్ తాతగా గర్వపడుతున్నానని చంద్రబాబు పేర్కొన్నారు.
Go Back to Shorts
Narendra Modi
Chandrababu
Nara Lokesh
Devansh
Bhuvaneswari

More Telugu News