పోరాడి సాధించిన గుజ్జర్లు.. రిజర్వేషన్ బిల్లుకు రాజస్థాన్ అసెంబ్లీ ఆమోదం
- రిజర్వేషన్ల కోసం ఎప్పటి నుంచో పోరాడుతున్న గుజ్జర్లు
- గుజ్జర్లతో పాటు మరో నాలుగు కులాలకు 5 శాతం రిజర్వేషన్
- సవరణ బిల్లును ఆమోదించిన రాజస్థాన్ అసెంబ్లీ
ఆరోజు ఆమోదించిన బిల్లు ప్రకారం వెనుకబడిన తరగతులకు ప్రస్తుతం అమలు చేస్తున్న రిజర్వేషన్ ను 21 శాతం నుంచి 26 శాతానికి పెంచారు. ఈ ఐదు శాతం రిజర్వేషన్ ను గుజ్జర్లతో పాటు గడియా లోహార్, బంజారా, గడరియా, రైకస్ కులాలకు వర్తింపజేస్తారు. ఈ ఐదు కులాలు చాలా వెనుకబడి ఉన్నాయని... వీరికి 5 శాతం రిజర్వేషన్లు అనివార్యమని బిల్లులో పేర్కొన్నారు.