మంగళగిరిలో ప్రేమజంటపై దాడి ఘటనలో... నిందితులు ప్రియుడి స్నేహితులే!
- శ్రీనివాసరావు ఇద్దరు స్నేహితులు అరెస్ట్
- శ్రీనివాసరావు, జ్యోతిల సెల్ ఫోన్లు సీజ్
- కేసును లోతుగా విచారిస్తున్నామన్న పోలీసులు
వీరిద్దరూ కలిసి బైక్ పై వెళుతున్నారన్న సమాచారం వారికి ముందే తెలిసిందని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసును మరింత లోతుగా విచారిస్తున్నామని అధికారులు వెల్లడించారు. కాగా, గత రాత్రి తాడేపల్లి, మహానాడు రోడ్డుకు చెందిన చుంచు శ్రీనివాసరావు, అతని ప్రియురాలు అంగడి జ్యోతితో కలిసి సర్టిఫికెట్ల కోసం గుంటూరు వెళుతుండగా, అమరావతి స్టేడియం సమీపంలో దాడి జరిగిన సంగతి తెలిసిందే.