గన్నవరం విమానాశ్రయంలో ఎయిర్బస్లూ ల్యాండ్ కావచ్చు.. నూతన రన్‌వే ప్రారంభం నేడు
- నవ్యాంధ్ర రాజధాని అమరావతికి ఏకైక ఆధారం ఇదే
- ఇప్పటి వరకు చిన్న విమానాల రాకపోకలకే అనుకూలం
- ఇకపై భారీ విమానాలకూ అవకాశం
ఈ విమానాశ్రయంలో చిన్న విమానాలు తప్ప పెద్ద విమానాలు దిగే సదుపాయం ఇప్పటి వరకు లేదు. దీంతో విమానాశ్రయంలో 3,523 అడుగుల వైశాల్యంతో నూతన రన్‌వేను నిర్మించారు. ఈ రన్‌వేను ఈరోజు కేంద్ర మంత్రి సురేష్‌ప్రభు ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. ఈ రన్‌వే అందుబాటులోకి వస్తే ఎయిర్ బస్ విమానాలు కూడా సులువుగా గన్నవరానికి రాకపోకలు జరిపే అవకాశం ఉంటుంది.