పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత సుధాకర్.. తలపై కోటి రూపాయల రివార్డు
- గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుధాకర్
- భార్య మాధవితో కలిసి రాంచీ పోలీసుల ఎదుట లొంగుబాటు
- నేడు అధికారికంగా వెల్లడించనున్న పోలీసులు
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుధాకర్ భార్య మాధవితో కలిసి రాంచి పోలీసుల ఎదుట లొంగిపోయినట్టు సమాచారం. ఈ విషయాన్ని నేడు మీడియా సమావేశంలో పోలీసులు వెల్లడించనున్నట్టు తెలుస్తోంది. కాగా, తెలంగాణలోనూ సుధాకర్‌పై పలు కేసులు ఉన్న నేపథ్యంలో అతడిని రాష్ట్రానికి తీసుకొచ్చి విచారించే అవకాశం ఉన్నట్టు సమాచారం.