మోదీ హోదా ఇవ్వకున్నా నైతిక విజయం మనదే: చంద్రబాబు
- మనం ఏకాకులం కాదు
- దేశం మొత్తం మనవెంటే ఉందని భరోసా వచ్చింది
- ఏపీ భవన్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు పాదయాత్ర
- దేశాన్ని దోచుకున్న దొంగలను విదేశాలకు పంపుతారు
మోదీని మించిన నటుడు దేశంలోనే లేడని ఆయన విమర్శించారు. గుజరాత్‌లో మతకల్లోలాలను రేపి.. శాంతి కోసమంటూ ప్రభుత్వ సొమ్ముతో దీక్షలు చేసిన చరిత్ర మోదీదని.. అలాంటి వ్యక్తి తమ దీక్షల గురించి ప్రశ్నిస్తారా? అంటూ మండిపడ్డారు. దేశాన్ని దోచుకున్న దొంగలను విదేశాలకు పంపుతారని ఎద్దేవా చేశారు. ఏపీకి కేంద్రం నుంచి లక్ష కోట్లు రావాల్సి ఉందని, అవి వచ్చేవరకూ దీక్ష కొనసాగిస్తామన్నారు. ఉదయం దీక్ష కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ప్రారంభమైందని.. దీక్ష ముగింపునకు మాజీ ప్రధాని దేవెగౌడ రావడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. అలాగే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా వచ్చారని చంద్రబాబు కొనియాడారు.