Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అదా శర్మకు ఇంత టాలెంటా?;;; ఫిదా అవుతున్న నెటిజన్లు!

  • మల్లకంబను ప్రాక్టీస్ చేసిన అదా శర్మ
  • చెట్టుకు తాడు కట్టి విన్యాసాలు
  • వైరల్ అవుతున్న చిత్రాలు
మల్లకంబ పేరు విన్నారా? భారతీయ సంప్రదాయ క్రీడల్లో ఇది చాలా వినూత్నంగా ఉంటుంది. ఓ చెక్క స్తంభంపై నిలబడటం, ఓ తాడును నడుముకు చుట్టుకుని, ఆపై చేతులు, కాళ్లతో బ్యాలెన్స్ చేసుకుంటూ, రకరకాల సాహస భంగిమలు చేయడం ఇందులో ఉంటాయి. ఇదేమంత సులువైనది కాదు.

మధ్యప్రదేశ్ రాష్ట్ర క్రీడగా ఉన్న ఈ మల్లకంబలో నటి అదా శర్మ నిష్ణాతురాలైంది. ఆమె మల్లకంబలో ప్రావీణ్యం సంపాదించగా, ఆ చిత్రాలను చూసిన నెటిజన్లు, 'ఆమెలో ఇంత టాలెంట్ ఉందా?' అంటూ ఫిదా అవుతున్నారు. తాజాగా, అదా శర్మ తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసిన ఓ ఫొటో వైరల్ అవుతోంది. ఈ నెల 16, 17 తేదీల్లో ముంబైలో తొలి మల్లకంబ జాతీయ పోటీలు జరుగనున్న నేపథ్యంలో, ఇదే క్రీడను అదా శర్మ ప్రాక్టీస్ చేసింది.

ఒక చెట్టు కొమ్మలకి ఓ తాడు కట్టి, దాన్ని కాళ్లకు, నడుముకి చుట్టుకుని వెల్లకిలా పడుకుని అద్భుత రీతిలో బ్యాలెన్స్ చేసింది. దాదాపు నలభై మూడు సెకన్ల పాటు ఈ విద్యను ప్రదర్శిస్తూ, ఆమె వీడియో తీసుకుంది. ఆమె ఫిట్ నెస్ ఇప్పుడు నెటిజన్లను ఉత్సాహపరుస్తోంది. కాగా, అదా శర్మ ఇప్పటికే, మల్లయుద్ధం, కత్తి సాము వంటి ఎన్నో విద్యలలో ప్రాక్టీస్ చేసి నిష్ణాతురాలైన సంగతి తెలిసిందే.
Ada Sharma
Mallakamba
Viral Videos

More Telugu News