లోకేశ్ సభలో ‘జగన్’ ఫొటోలున్న కుర్చీలు.. నిర్వాహకులపై మండిపడ్డ టీడీపీ నేతలు!
- తిరుపతిలో ఈరోజు ఇళ్ల అందజేత కార్యక్రమం
- హాజరైన మంత్రులు లోకేశ్, ఆదినారాయణ రెడ్డి
- కుర్చీలపై ‘రావాలి జగన్-కావాలి జగన్’ స్టిక్కర్లు
టీడీపీ కార్యక్రమంలో జగన్ ఫొటోలున్న కుర్చీలు కనిపించడంతో మీడియా ప్రతినిధులు అక్కడకు చేరుకుని చిత్రీకరించడం ప్రారంభించారు. వెంటనే అప్రమత్తమైన టీడీపీ నేతలు ఆ కుర్చీలను సభా ప్రాంగణం నుంచి తొలగించారు. ఈ సందర్భంగా సభకు ఏర్పాట్లు చేసిన నిర్వాహకులపై టీడీపీ నేతలు మండిపడ్డారు. రెండ్రోజుల క్రితం తిరుపతిలో జగన్ ‘సమర శంఖారావం’ సభ జరిగిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమానికి అందించిన కుర్చీలనే తాజాగా ఇప్పుడు టీడీపీ సభకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.