అసెంబ్లీలో మంత్రిని నిలదీసిన సొంత పార్టీ ఎమ్మెల్యేలు.. సమాధానం చెప్పలేక ఉక్కిరి బిక్కిరైన అచ్చెన్నాయుడు!

  • నిధుల గురించి ప్రశ్నించిన రవికుమార్
  • అచ్చెన్న సమాధానంపై అసంతృప్తి
  • మద్దతు తెలిపిన స్పీకర్ కోడెల
  • ప్రతిపక్ష పాత్ర పోషించిన ఎమ్మెల్యేలు
తమ పార్టీకి చెందిన మంత్రినే.. ఎమ్మెల్యేలు నిలదీసిన ఆసక్తికర పరిణామం ఏపీ అసెంబ్లీలో చోటు చేసుకుంది. బీసీ సబ్‌ప్లాన్‌పై అసెంబ్లీలో చర్చ జరిగిన సందర్భంగా.. ప్రభుత్వ విప్ కూన రవికుమార్.. అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సబ్‌ప్లాన్‌లోని నిధులు జనాభా ప్రాతిపదికన ఇస్తారా? లేదంటే రిజర్వేషన్ ప్రకారం ఇస్తారా? అని విప్ కూన ప్రశ్నించగా.. జనాభా ప్రాతిపదికన ఇస్తామని మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం చెప్పారు.

అచ్చెన్న సమాధానంలో క్లారిటీ లేదంటూ రవికుమార్ అసంతృప్తి వ్యక్తం చేయగా.. దీనికి స్పీకర్ కోడెల శివప్రసాద్ కూడా మద్దతు తెలిపారు. ఎమ్మెల్యేల ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానమివ్వకపోవడంతో ఎమ్మెల్యేలంతా ఒకేసారి ప్రతిపక్ష పాత్ర పోషించారు. రవికుమార్ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే శ్రవణ్ కూడా డిమాండ్ చేశారు. అంతా ఒకేసారి ప్రశ్నల వర్షం కురిపించడంతో అచ్చెన్నాయుడు ఉక్కిరి బిక్కిరయ్యారు.
Go Back to Shorts
Achennaidu
AP Assembly
Kuna Ravi kumar
Kodela Sivaprasad
Sravan

More Telugu News