మమత ధర్నాలో పాల్గొన్న పోలీసు అధికారులపై కేంద్రం సీరియస్

  • ధర్నాలో పాల్గొన్న ఐపీఎస్ అధికారులు
  • కేంద్ర ప్రభుత్వంలో పని చేయకుండా నిషేధించే అవకాశం
  • పోలీసు పతకాలను వెనక్కి తీసుకోవాలని యోచన
శారదా స్కామ్‌ కేసు విచారణకు సంబంధించి కోల్ కతా పోలీస్ కమీషనర్ పట్ల సీబీఐ వ్యవహరించిన తీరును నిరసిస్తూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ ధర్నా చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ధర్నాలో కొందరు ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. దీనిపై కేంద్రం సీరియస్ అయ్యింది. దీక్షలో పాల్గొన్న పోలీసు అధికారులపై చర్య తీసుకోవాలని కేంద్ర హోంశాఖ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ అధికారులపై కేంద్ర ప్రభుత్వంలో పని చేయకుండా నిషేధం విధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వారి పోలీసు పతకాలను వెనక్కి తీసుకోవాలని కేంద్రం యోచిస్తోంది.
Go Back to Shorts
Mamatha Benarji
West Bengal
IPS Officers
Central Government
Sarada Scam

More Telugu News