ఫుట్ వేర్ రంగంలోకి షియోమీ కంపెనీ.. భారత్ లో సరికొత్త షూస్ ఆవిష్కరణ!

  • ఎంఐ స్పోర్ట్స్ షూస్-2 ను లాంచ్ చేసిన షియోమీ
  • ప్రారంభ ధర రూ.2,499గా ప్రకటన
  • మార్చి 15 నుంచి షిప్పింగ్ ప్రారంభం
స్మార్ట్ ఫోన్, ఎలక్ట్రానిక్స్ రంగంలో ఇప్పటికే ప్రకంపనలు సృష్టిస్తున్న చైనా కంపెనీ షియోమీ ఫుట్ వేర్ రంగంలోకి అడుగుపెట్టింది. తాజాగా భారత యువతే లక్ష్యంగా ‘ఎంఐ స్పోర్ట్స్ షూస్2’ను తీసుకొచ్చినట్లు ప్రకటించింది. రూ.2,499 ప్రారంభ ధరగా ఉన్న ఈ షూస్ ను ఎంఐ ఇండియా వెబ్ సైట్ ద్వారా ప్రీబుకింగ్ చేసుకోవచ్చు. వచ్చే నెల 15 నుంచి ఈ ఆర్డర్లకు షిప్పింగ్ మొదలవుతుంది.

బ్లాక్‌, గ్రే, బ్లు రంగుల్లో ఎంఐ షూస్ లభ్యమవుతున్నాయి. 5 ఇన్‌ 1 మౌల్డింగ్‌ టెక్నాలజీతో పాటు షాక్‌ అబ్సార్బెంట్ గా, దీర్ఘకాలం మన్నేలా వీటిని రూపొందించినట్లు కంపెనీ చెబుతోంది. ప్రస్తుతం షియోమీ కంపెనీ భారత్ లో ఎంఐ టీవీలు, ఎయిర్ ప్యూరిఫయర్లు, మాస్కులు, సన్ గ్లాసెస్, సూట్ కేసులను విక్రయిస్తోంది.
Go Back to Shorts
shaomi
mi
shoes
India
pre booking

More Telugu News