అవకాశాలు లేవు, ప్రవర్తన బాగాలేదు... నటి ఝాన్సీని దూరం పెట్టానన్న సూర్యతేజ
- మంగళవారం రాత్రి నాగఝాన్సీ ఆత్మహత్య
- తనకు ఓ ఫంక్షన్ లో పరిచయమైందన్న సూర్యతేజ
- కొన్నాళ్లుగా దూరం పెట్టానని వెల్లడి
ఆ తరువాత ఆమె ఎన్నో ఇబ్బందులు పడిందని, తనకు విషయం చెప్పి బాధపడేదని చెప్పాడు. ఆమె జోలికి వెళ్లవద్దని తాను గతంలో గిరిని హెచ్చరించానని, ఝాన్సీని కూడా పద్ధతి మార్చుకోవాలని ఎన్నోమార్లు సూచించినా ఆమె వినలేదని అన్నాడు. ఆ కారణంతోనే ఆమెతో మాట్లాడటం లేదని, కొన్నాళ్లుగా దూరంగా ఉన్నానని చెప్పాడు. కాగా, ఈ కేసులో ఝాన్సీ సెల్ ఫోన్ కీలక సాక్ష్యాలను అందిస్తుందని పోలీసులు భావిస్తున్నారు. ఫోన్ లోని సమాచారాన్ని విశ్లేషించేందుకు ఐటీ నిపుణుల సాయం తీసుకుంటున్నారు.