Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'సీత' .. టైటిల్ కి భిన్నంగా కనిపించనున్న కాజల్?

  • తేజ దర్శకత్వంలో కాజల్ 'సీత'
  • అమాయకుడి పాత్రలో బెల్లంకొండ
  • డిఫరెంట్ గా కనిపించే సోనూ సూద్  
తేజ దర్శకత్వంలో 'సీత' సినిమా రూపొందుతోంది. కాజల్ ప్రధాన పాత్రధారిగా నిర్మితమవుతోన్న ఈ సినిమాలో ఆయన జోడీగా బెల్లంకొండ శ్రీనివాస్ కనిపించనున్నాడు. 'సీత' అనగానే ఈ సినిమాలో కాజల్ చాలా సాఫ్ట్ గా కనిపిస్తుందనీ .. సున్నితమైన మనసు కలిగినదిగా అనిపిస్తుందని అనుకునే అవకాశాలు ఎక్కువ. కానీ అందుకు పూర్తి విరుద్ధంగా ఆమె పాత్రను డిజైన్ చేయడం జరిగిందనే టాక్ వినిపిస్తోంది.

ఎవరి మాటను లెక్కపెట్టకుండా తనకి ఏది తోస్తే అది చేసేస్తూ వెళుతుందట. ఇలా టైటిల్ కి భిన్నంగా ఆమె తెరపై కనిపిస్తుందని అంటున్నారు. ఇక ఆమె తానా అంటే తందానా అనే అమాయకపు పాత్రలో బెల్లంకొండ శ్రీనివాస్ కనిపిస్తాడని చెబుతున్నారు. సోనూ సూద్ పాత్రను కూడా చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారని చెప్పుకుంటున్నారు. ఈ సినిమా తరువాత తెలుగులోనూ సోనూ సూద్ బిజీ అవుతాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి తేజ సరికొత్త 'సీత'ను చూపించనున్నాడన్న మాట.
kajal
bellamkonda

More Telugu News