Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దురదృష్టవశాత్తు మీ అంచనాలను అందుకోలేకపోయాము: రామ్ చరణ్

  • అందరం కలిసి చాలా కష్టపడ్డాము
  • మంచి సినిమాను అందించలేకపోయాము
  • మీ ప్రేమాభిమానాలు ఎప్పటికీ ఉండాలి
చరణ్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన 'వినయ విధేయ రామ' .. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'రంగస్థలం' వంటి భారీ విజయం తరువాత వచ్చిన ఈ సినిమా, ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయింది. తాజాగా ఈ సినిమా ఫలితంపై హీరో రామ్ చరణ్ స్పందిస్తూ .. ఒక ప్రెస్ నోట్ ను రిలీజ్ చేశాడు.

"ప్రియమైన అభిమానులకు .. ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ సినిమా కోసం రేయింబవళ్లు కష్టించి పనిచేసిన సాంకేతిక నిపుణులకు .. పంపిణీదారులకు .. ప్రదర్శనదారులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక ఈ సినిమా విషయంలో నిర్మాత దానయ్యగారి సహకారం మరువలేనిది.

'వినయ విధేయ రామ'తో మీ అందరికీ వినోదాన్ని పంచడానికి అంతా కలిసి ఎంతో శ్రమించాము. కానీ దురదృష్టవశాత్తు ఒక మంచి సినిమాను అందించలేకపోయాము .. మీ అంచనాలను అందుకోలేకపోయాము. భవిష్యత్తులో మీకు నచ్చే .. మీరు మెచ్చే సినిమాలు చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాను. మీ ప్రేమాభిమానాలు ఎప్పటికీ ఇలాగే వుండాలని కోరుకుంటున్నాను. అన్నివేళలా తమ మద్దతును అందించిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు" అంటూ ఆయన ఈ ప్రెస్ నోట్ లో పేర్కొన్నాడు.
charan

More Telugu News