బీజేపీలో దమ్మున్న నాయకుడు గడ్కరీనే!: రాహుల్ గాంధీ
- నాగపూర్ లో గడ్కరీ వ్యాఖ్యలపై రాహుల్ స్పందన
- రాఫెల్ కుంభకోణం గురించి కూడా మాట్లాడాలి
- అనిల్ అంబానీ, ఉద్యోగాల గురించీ ప్రస్తావించాలి
చాలా మంది కార్యకర్తలు ముందుగా తమ ఇంటిని, ఇల్లాలిని, పిల్లలను చూసుకోలేనివాళ్లు దేశాన్ని ఏం కాపాడతారని కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ ప్రశ్నించిన విషయం తెలిసిందే. నాగపూర్ లోని ఏబీవీపీ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్న గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు. గడ్కరీ చేసిన ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు.
బీజేపీలో దమ్మున్న నాయకుడెవరైనా ఉన్నారంటే, ఆ నాయకుడు గడ్కరీనే అని ప్రశంసించారు. రాఫెల్ కుంభకోణం, అనిల్ అంబానీ, రైతుల ఆవేదన, వ్యవస్థల నిర్వీర్యం గురించి కూడా మాట్లాడాలని నితిన్ ని రాహుల్ కోరుతూ ఓ ట్వీట్ చేశారు. "మరో ముఖ్యమైన విషయం మరిచిపోయాను, గడ్కరీ జీ.. జాబ్స్!, జాబ్స్!’ అని, దీనిపైనా వ్యాఖ్యానించాలని కోరుతూ రాహుల్ మరో ట్వీట్ చేయడం గమనార్హం.
— Rahul Gandhi (@RahulGandhi) February 4, 2019
బీజేపీలో దమ్మున్న నాయకుడెవరైనా ఉన్నారంటే, ఆ నాయకుడు గడ్కరీనే అని ప్రశంసించారు. రాఫెల్ కుంభకోణం, అనిల్ అంబానీ, రైతుల ఆవేదన, వ్యవస్థల నిర్వీర్యం గురించి కూడా మాట్లాడాలని నితిన్ ని రాహుల్ కోరుతూ ఓ ట్వీట్ చేశారు. "మరో ముఖ్యమైన విషయం మరిచిపోయాను, గడ్కరీ జీ.. జాబ్స్!, జాబ్స్!’ అని, దీనిపైనా వ్యాఖ్యానించాలని కోరుతూ రాహుల్ మరో ట్వీట్ చేయడం గమనార్హం.
Gadkari Ji, compliments! You are the only one in the BJP with some guts. Please also comment on:
1. The #RafaleScam & Anil Ambani
2. Farmers’ Distress
3. Destruction of Institutionshttps://t.co/x8BDj1Zloa