భానుప్రియ కేసులో కొత్త ట్విస్ట్... మైనర్ బాలిక, ఆమె తల్లి అరెస్ట్!
- భానుప్రియ కుటుంబీకులపై ఫిర్యాదు
- తప్పుడు ఫిర్యాదేనని తేల్చిన పోలీసులు
- మరింత లోతుగా విచారణ
ఆ బాలిక బీరువా తాళాలు ఎక్కడ పెడతారో గమనించి రూ. 1.50 లక్షల నగదు, నగలు దొంగిలించి తల్లికి ఇచ్చిందని, ఆపై భానుప్రియ కుటుంబీకులు నిలదీస్తే, నేరం అంగీకరించి నగలను వెనక్కు తెచ్చిందని పోలీసులు తెలిపారు. మిగతా డబ్బు అడుగుతారని భావించి, తప్పుడు కేసును పెట్టారని, వారిద్దరినీ మరింత లోతుగా విచారిస్తున్నామని అన్నారు.