తెరపైకి ఓటుకు నోటు కేసు.. వేం నరేందర్ రెడ్డికి ఈడీ నోటీసులు
- వారం రోజుల్లో కార్యాలయంలో హాజరు కావాలని నోటీసు
- త్వరలో రేవంత్, సండ్ర తదితరులకు నోటీసులు
- రూ.50 లక్షల ముడుపులు ఇవ్వజూపారని అభియోగం
వేం నరేందర్ రెడ్డిని గెలిపించేందుకు రేవంత్, సండ్ర, సెబాస్టియన్, ఉదయసింహా కలిసి కుట్ర పన్నారని ఏసీబీ అభియోగం మోపింది. ఈ నేపథ్యంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షలు ముడుపులు ఇచ్చేందుకు నిందితులు ప్రయత్నించారని అభియోగ పత్రంలో పేర్కొంది.