అరకు ఎమ్మెల్యే కిడారి హత్యోదంతం... నిందితులకు మార్చి 1 వరకు రిమాండ్
- కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమలను కాల్చిచంపిన మావోయిస్టు
- కేసు దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ
- ఆరుగురు నిందితుల అరెస్టు
ఈ కేసు విచారణ చేపట్టిన కేంద్ర దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఆరుగురు అనుమానితులను అరెస్టు చేసి కోర్టు ముందుంచింది. నిందితులు సుబ్బారావు, ఈశ్వరి, జమిలి శోభన్, కొర్రాకమల, పంగి నరసయ్య, వంత ధర్మయ్యలకు కోర్టు జనవరి 31 వరకు రిమాండ్ విధించింది. ఈ గడువు గురువారంతో ముగియడంతో పటిష్ట బందోబస్తు మధ్య నిందితులను కోర్టు ముందు హాజరుపరచగా మార్చి 31 వరకు రిమాండ్కు న్యాయమూర్తి ఆదేశించారు.