కశ్మీర్ లోకి చొరబడ్డ జైషే ఉగ్రవాదులు.. ఇద్దరిని కాల్చిచంపిన భద్రతాబలగాలు!

  • పుల్వామాలోని రాజ్ పొరాలో ఎన్ కౌంటర్
  • కార్డన్ సెర్చ్ చేపట్టిన భద్రతా బలగాలు
  • తుపాకులు, మందుగుండు సామగ్రి స్వాధీనం
జమ్మూకశ్మీర్ లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య నిన్న రాత్రి మొదలైన ఎన్ కౌంటర్ ముగిసింది. నిషేధిత జైషే మహమ్మద్ సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను బలగాలు ఈరోజు కాల్చిచంపాయి. ఈ ఘటన పుల్వామా జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని రాజ్ పోరా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘా వర్గాలు భద్రతా బలగాలకు సమాచారం ఇచ్చాయి.

దీంతో రంగంలోకి దిగిన బలగాలు.. ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టి కార్డన్ సెర్చ్ ప్రారంభించాయి. అయితే భద్రతా బలగాలు తమను చుట్టుముట్టినట్టు గమనించిన ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ పరారయ్యేందుకు యత్నించారు. దీంతో ఆత్మరక్షణలో భాగంగా బలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి.

ఈరోజు ఉదయం వరకూ సాగిన ఈ ఎన్ కౌంటర్ లో జైషేకు చెందిన షాహిద్ అహ్మాద్, అనియత్ అహ్మద్ లు ప్రాణాలు కోల్పోయారు. అధికారులు ఘటనాస్థలం నుంచి ఎస్ఎల్ఆర్, పిస్టళ్లతో పాటు భారీగా మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
Go Back to Shorts
Jammu And Kashmir
encounter
jaishay
2 dead
Police
security forces

More Telugu News