ధరలను అమాంతం పెంచి డిస్కౌంట్లు ఇస్తున్న స్నాప్ డీల్: సీఈఆర్సీ నివేదిక
- దొంగ డిస్కౌంట్లను చూపిస్తూ మోసం
- పూర్తి స్థాయి దర్యాఫ్తు చేయాలి
- సీఈఆర్సీ నివేదిక
అరకొర లేబులింగ్, అధిక ధరలతో మోసం చేస్తున్న స్మాప్ డీల్ పై డీజీసీఐ (డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా) చర్యలు చేపట్టాలని సూచించింది. పలు హానికారక ఉత్పత్తులను కస్టమర్లకు స్నాప్ డీల్ విక్రయించిందని, వాటిని వెనక్కు తీసుకుని, పరిహారం చెల్లించాలని సూచించింది. స్నాప్ డీల్ లో పారదర్శకత లేదని, పాలసీ ఉల్లంఘనలు జరుగుతున్నాయని, ఉత్పత్తుల వారీగా విక్రయాలపై పూర్తి స్థాయిలో దర్యాఫ్తు చేయాల్సిన అవసరం ఉందని సీఈఆర్సీ సీజీఎం ప్రీతి షా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.