Andhra Pradesh: వైసీపీ నేత గౌతం రెడ్డి నా స్థలాన్ని కబ్జా చేశాడు.. న్యాయం చేయండి!: విజయవాడలో బాధితుడి ఆందోళన
- అధికారులను కలిసినా న్యాయం జరగలేదు
- నా 325 గజాల స్థలాన్ని ఆక్రమించుకున్నారు
- మీడియా ముందు వాపోయిన ఉమామహేశ్వరరావు
ఇటీవల ముస్లిం మతస్తులపై నోరు జారి ఇబ్బందులో పడిపోయిన విజయవాడ వైసీపీ నేత గౌతం రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. గౌతం రెడ్డి నకిలీ డాక్యుమెంట్లతో తన స్థలాన్ని ఆక్రమించుకున్నారని ఉమామహేశ్వరరావు అనే వ్యక్తి ఆందోళనకు దిగాడు. విజయవాడలో తనకు ఉన్న 325 గజాల స్థలాన్ని ఆయన కబ్జా చేశారని ఆరోపించాడు.
ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని కోరుతూ ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగాననీ, అయినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్ ను కూడా కలుకున్నట్లు తెలిపాడు.
అయినా తనకు న్యాయం జరగకపోవడంతో ఇప్పుడు మీడియా ముందుకు వచ్చానని చెప్పాడు. ఇప్పటికైనా తనకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశాడు. కాగా, ఈ వివాదంపై వైసీపీ నేత గౌతం రెడ్డి ఇంకా స్పందించలేదు.