డబ్బులు డ్రా చేసేందుకు ఏటీఎంలోకి.. చిరుత పులి పిల్లను చూసి పరుగో పరుగు!
- దారి తప్పి గ్రామంలోకి వచ్చిన చిరుత పిల్ల
- చలికి తట్టుకోలేక ఏటీఎంలోకి
- పట్టుకుని అడవిలో వదిలేసిన అధికారులు
సదరు వ్యక్తి కేకలు వేస్తూ పరుగులు పెట్టడంతో ఆరా తీసిన స్థానికులు ఏటీఎంకు చేరుకుని లోపలున్న చిరుత పిల్లను బయటకు తీసేందుకు ప్రయత్నించారు. చివరికి ఓ టాక్సీ డ్రైవర్ సాహసం చేసి ఏటీఎం నుంచి దానిని బయటకు తీశాడు. అతడి చేతుల నుంచి తప్పించుకున్న అది అక్కడే ఉన్న ఓ వాహనం కిందికి వెళ్లి నక్కింది. దీంతో వారు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వారొచ్చి దానిని పట్టుకుని అడవిలో వదిలిపెట్టారు. చిరుత పిల్ల ఏటీఎంలో దూరడంపై స్థానికులు మాట్లాడుతూ.. చలికి తట్టుకోలేకే అది అందులో దూరినట్టు చెప్పారు.