మళ్లీ అదే మాట.. పవన్ ఎవరో తనకు తెలియదన్న అశోక్‌గజపతి రాజు!

  • ఎన్టీఆర్ ఎ బయోపిక్ పుస్తకావిష్కరణ
  • చిరంజీవి, ఆయన తండ్రి తనకు తెలుసన్న అశోక్ గజపతి
  • సినిమాలు చూడను కాబట్టి పవన్ తెలియదని వ్యాఖ్య
టీడీపీ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతి రాజు మళ్లీ పాత పాటే పాడారు. ప్రముఖ నటుడు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ ఎవరో తనకు తెలియదని మరోమారు వ్యాఖ్యానించారు. ‘ఎన్టీఆర్ ఎ బయోగ్రఫీ’ పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న అశోక్ గజపతి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

తాను సినిమాలు చూడనని, కాబట్టి పవన్ కల్యాణ్ ఎవరో తనకు తెలియదని అన్నారు. ఆయన అన్న చిరంజీవి మాత్రం తనకు తెలుసన్నారు. వాళ్ల తండ్రి కూడా తనకు తెలుసని అశోక్ గజపతి పేర్కొన్నారు. ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్నప్పుడు పవన్ తండ్రి ఓ సారి తనను కలిస్తే పనిచేసి పెట్టానని గుర్తు చేసుకున్నారు.

గతంలోనూ అశోక్ గజపతి రాజు ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. అప్పట్లో ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారం సృష్టించాయి. స్వయంగా పవన్ స్పందించి తానెవరో తెలియకుండానే గెలిచారా? అని ప్రశ్నించారు. త్వరలోనే విజయనగరం వచ్చి పరిచయం చేసుకుంటానని ఎద్దేవా చేశారు.  
Go Back to Shorts
Pawan Kalyan
Jana sena
Telugudesam
Ashok Gajapathi Raju
Andhra Pradesh

More Telugu News