కరెంట్ షాక్ కొట్టడంతో.. పెళ్లయిన నాలుగు రోజులకే ప్రాణాలు కోల్పోయిన నవవధువు!
- పొరపాటున హీటర్ ను పట్టుకున్న యువతి
- స్విచ్ఛాఫ్ చేయకపోవడంతో విద్యుత్ ప్రసారం
- విషాదంలో మునిగిపోయిన ఇరు కుటుంబాలు
కొద్దిసేపటి తర్వాత నీళ్లు వేడిగా అయ్యుంటాయని భావించిన మనీషా హీటర్ ను బయటకు తీయబోయింది. అయితే తడిగా ఉన్న హీటర్ మనీషాకు తగలడం, స్విచ్ ఆఫ్ చేయకపోవడంతో ఒక్కసారిగా విద్యుత్ ప్రసారం జరిగింది. దీంతో బాధితురాలు అక్కడికక్కడే గిలగిలా కొట్టుకుని ప్రాణాలు విడిచింది.
ఆమె అరుపులు విన్న కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఆమె మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మనీషా మృతితో ఆమె తల్లిదండ్రులతో పాటు అత్తారింటివారు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.