పద్మశ్రీ అవార్డును తిరస్కరించిన గీతా మెహతా!
- రాజకీయంగా మంచిదికాదన్న రచయిత్రి
- క్షమించాలని కోరిన ఒడిశా సీఎం సోదరి
- 21 భాషల్లో అనువాదమైన గీత పుస్తకాలు
త్వరలోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ అవార్డును స్వీకరిస్తే రాజకీయంగా తప్పుడు సంకేతాలు వెళతాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అవార్డును స్వీకరించడం, తనతో పాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా మంచిదికాదని వ్యాఖ్యానించారు. అందుకే ఈ అవార్డును తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆల్ప్రెడ్ ఎ.నోఫ్ పబ్లిషింగ్ హౌస్ అధిపతి సోనీ మెహతాను గీత పెళ్లి చేసుకున్నారు. గీత రాసిన పుస్తకాలు 21 భాషల్లోకి అనువాదమయ్యాయి.