జయలలిత ఎస్టేట్ గార్డ్ హత్యకేసులో.. పళనిస్వామిపై దాఖలైన పిటిషన్ కొట్టివేత
- అనుమానాస్పద స్థితిలో గార్డ్ హత్య
- వీడియో క్లిప్ ఆధారంగా పళనిపై పిటిషన్
- నేడు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు
ఈ హత్యతో పళనిస్వామికి సంబంధం ఉందంటూ ఇటీవల ఓ మ్యాగజైన్ విడుదల చేసిన వీడియో క్లిప్ ఆధారంగా సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎస్టేట్ హత్య కేసులో సీబీఐ దర్యాప్తు చేపట్టాలని ఆయన పిటిషన్లో కోరారు. ఈ కేసు విషయమై నేడు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు... రామస్వామి వేసిన పిటీషన్‌ను తోసిపుచ్చింది. కొందరు దుండగులు గార్డ్‌ను హత్య చేసి విలువైన పత్రాలు, వస్తువులను దోచుకెళ్లినట్టు అప్పట్లో పోలీసులు పేర్కొన్నారు.