మీ ఇష్టం.. మీరే నిర్ణయించుకోండి!: ఎన్నికల్లో పోటీపై అద్వానీ, జోషిలకు బీజేపీ సూచన

  • బీజేపీలో ఏజ్ బార్ లిమిట్
  • 75 ఏళ్లు దాటిన వారికి మంత్రివర్గంలో చోటు లేదు
  • ఎన్నికల్లో పోటీ చేసే విషయాన్ని అద్వానీ, జోషిలకే వదిలేసిన హైకమాండ్
బీజేపీ అగ్ర నేతలైన అద్వానీ, మురళీ మనోహర్ జోషిలకు సంబంధించి ఆ పార్టీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. రానున్న ఎన్నికల్లో పోటీ చేసే నిర్ణయాన్ని వారికే వదిలేసింది. మేలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారా? లేదా? అనే నిర్ణయాన్ని మీరే తీసుకోవాలంటూ వారికి సూచించింది.

75 ఏళ్ల వయసు పైబడిన నేతలను బీజేపీ ప్రస్తుత నాయకత్వం మంత్రివర్గంలోకి తీసుకోవడం లేదు. అయితే, ఎన్నికల్లో పోటీ చేయడానికి మాత్రం వయోపరిమితి విధించలేదు. అద్వానీ ప్రస్తుత వయసు 91 కాగా... జోషి వయసు 84 ఏళ్లు. మరోవైపు అనారోగ్య కారణాలతో సుష్మాస్వరాజ్, ఉమా భారతిలు కూడా ఎన్నికలకు దూరంగా ఉండే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు జోషికి అత్యంత సన్నిహితుడైన ఒక వ్యక్తి మాట్లాడుతూ, పార్టీ తీసుకునే నిర్ణయం మేరకు జోషి నడుచుకుంటారని చెప్పారు.
Go Back to Shorts
bjp
advani
murali manohar joshi
elections

More Telugu News