ఇందిరాగాంధీతో ఒప్పులకుప్ప ఆడుతున్న ప్రియాంక.. 40 ఏళ్లనాటి ఫొటోను షేర్ చేసిన కాంగ్రెస్
- ఇందిర-ప్రియాంక ఒకటేనని చెప్పే ఉద్దేశం
- కుటుంబ ఆల్బం నుంచి తీసి మరీ షేర్ చేసిన వైనం
- సోషల్ మీడియాలో ఫొటో వైరల్
ఇందిర కుటుంబ ఆల్బం నుంచి తీసి మరీ దీనిని షేర్ చేశారు. నానమ్మ ఇందిరా గాంధీతో ప్రియాంక ‘ఒప్పుల కుప్ప’ ఆట ఆడుతున్న ఫొటో అది. ప్రియాంక గాంధీలో ఇందిరను చూపించే ప్రయత్నం చేయడంలో భాగంగానే ఈ ఫొటోను కాంగ్రెస్ పోస్టు చేసింది. ‘శక్తి సంపన్నులైన మహిళలు శక్తిసంపన్నులనే ప్రోత్సహిస్తారు’ అని ఈ ఫొటోకు క్యాప్షన్ తగిలించింది. ‘నానమ్మ లానే మనవరాలు కూడా’, ‘కుటుంబం-ప్రేమ-మహిళా సాధికారత’ అన్న ట్యాగ్ లైన్లు కూడా ఈ ఫొటోకు తగిలించింది. ఇప్పుడీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.