రైల్వేలో 2.50 లక్షల ఉద్యోగాల భర్తీ.. అగ్రవర్ణ పేదలకు పదిశాతం రిజర్వేషన్ అమలు: పీయూష్ గోయల్
- ఫిబ్రవరిలో తొలి విడత నోటిఫికేషన్
- మేలో రెండో విడత
- 2021 నాటికి మొత్తం భర్తీ
వచ్చే నెలలోనే తొలి విడత రైల్వే ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు మంత్రి వివరించారు. మే నెలలో రెండో విడత భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు చెప్పారు. ఆగస్టు 2021 నాటికి మొత్తం భర్తీ ప్రక్రియ పూర్తవుతుందని రైల్వే వర్గాలు తెలిపాయి. కాగా, గతేడాది 1.2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ కాగా 2.5 కోట్ల మంది దరఖాస్తు చేసుకున్నారు.