వచ్చే నెలలో రజనీకాంత్ కూతురు సౌందర్య పెళ్లి!
- 2010లో అశ్విన్ తో వివాహం
- 2017లో విడాకులు
- క్రితం ఏడాది విషగన్ తో నిశ్చితార్థం
ఓ ఫార్మా కంపెనీ యజమాని అయిన విషగన్, కొన్ని తమిళ చిత్రాల్లోనూ నటించాడు. ఫిబ్రవరి 11వ తేదీన చెన్నైలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్లో వీరి వివాహం జరగనుంది. మెహెందీ .. సంగీత్ కార్యక్రమాలను కలుపుకుని, ఇది మూడు రోజుల పాటు జరిగే వివాహ వేడుక అని తెలుస్తోంది. పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకి హాజరు కానున్నట్టు సమాచారం.