చిత్తూరు జిల్లా టీడీపీకి కంచుకోట.. జిల్లాకు ఇంకా చాలా చేస్తాం!: సీఎం చంద్రబాబు
- జిల్లా ప్రజలు పార్టీ జెండాను మోశారు
- కృష్ణా జలాలు తీసుకురావడం ఆరంభమే
- ట్విట్టర్ లో స్పందించిన టీడీపీ అధినేత
అనంతపురం జిల్లా సరిహద్దు బొంతలపల్లి నుంచి హంద్రినీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను చిత్తూరు జిల్లాకు రెండ్రోజుల క్రితం తీసుకొచ్చారు. దీనివల్ల చిత్తూరులోని 7 నియోజకవర్గాల్లో ఉన్న 38 మండలాలకు సాగునీరు అందుబాటులోకి రానుంది.