తెలంగాణలో తొలి విడత పంచాయతీ... తుది ఫలితాల వివరాలు!
- ముగిసిన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు
- 59 శాతం స్థానాల్లో టీఆర్ఎస్ మద్దతుదారుల విజయకేతనం
- 20 శాతం స్థానాల్లో పాగా వేసిన కాంగ్రెస్
- మిగతా పార్టీలు నామమాత్రమే
అధికార టీఆర్ఎస్ మద్దతుదారులు ఏకగ్రీవాలతో కలిపి 2,629 పంచాయతీలను కైవసం చేసుకున్నారు. అంటే దాదాపు 59 శాతం సర్పంచ్ పదవులు టీఆర్ఎస్ సొంతమైనట్టు. ఇక 920 పంచాయతీలను కాంగ్రెస్ మద్దతుదారులు దక్కించుకున్నారు. అంటే సుమారు 20 శాతం పంచాయతీలు కాంగ్రెస్ చేతుల్లోకి వెళ్లినట్టు. ఇక బీజేపీ మద్దతుదారులు 67 చోట్ల, సీపీఎం 32, తెలుగుదేశం 31, సీపీఐ మద్దతుదారులు 19 చోట్ల గెలిచారు. ఇతరులు 758 పంచాయతీలను దక్కించుకున్నారు. పలు కారణాల వల్ల 14 పంచాయతీల ఫలితాలు ఆగిపోయాయి.